ETV Bharat / state

ఓ పాఠశాల..ఓ టీచర్, మధ్యలో వాలంటీర్

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పాత నిమ్మతొర్లాడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే టీచర్ ఉన్నారు. ఉన్న ఒక్క టీచర్ సెలవు పెడితే, పాఠశాలకు సెలవు ఇస్తున్నారు. దీంతో గ్రామస్థులంతా తమ పాఠశాలకు కావల్సిన సిబ్బందిని ఇవ్వాలని వేడుకుంటున్నారు.

పాఠాలు బోధిస్తున్న వాలంటీర్
author img

By

Published : Aug 20, 2019, 4:39 PM IST

Updated : Aug 20, 2019, 5:40 PM IST

పాఠాలు బోధిస్తున్న వాలంటీర్

అనగనగా ఓ ఊరు. ఆ ఊరులో ఓ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. పాఠశాల అన్నాక విద్యార్దులు, ఉపాధ్యాయులుంటారు..ఆ స్కూల్లో 33 విద్యార్దులు ఉంటే, ఉపాధ్యాయులు ..కాదు, ఒకే ఒక టీచర్ ఉంది. ఇలా ఒక టీచర్, 33 విద్యార్దులతో కాలం సాఫీగా సాగిపోతుండగా , ఒక రోజు ఆ టీచర్ కు పని పడింది. విధులకు సెలవు పెట్టింది. దీంతో పాఠశాలకు సెలవు వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఆ ఉపాధ్యాయురాలికి జ్వరం వచ్చింది. మళ్లి స్కూల్ కి సెలవు. ఇలా..పదే పదే జరుగుతుండటంతో ఆ గ్రామస్థులకు చిరాకు వచ్చింది. వెంటనే విషయాన్ని పెద్దొళ్ల దృష్టికి తీసుకెళ్లారు. సదరు ఉన్నతాధికార్లు చూద్దాం లే..అన్నారు. కాలం గడుస్తున్న కొద్ది పరిస్థిలో మార్పు రాకపోవడంతో గ్రామస్ధుల్లో అసహనం పెరిగిపోయింది. సమస్యను తామే పరిష్కరించుకుంటామని , ఆ గ్రామంలో టీచర్ ట్రైనింగ్ తీసుకున్న యువతిని వాలంటీర్ గా పెట్టుకున్నారు. సదరు టీచర్ రాని రోజు ఈ వాలంటీరే పిల్లలకు పాఠాలు చెబుతోంది.

ఇది, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి. ఇప్పటికైన ఉన్నతాధికార్లు స్పందించి పాఠశాలకు కావల్సిన సిబ్బందిని భర్తీ చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

అరుదైన జీవజాతులను ప్రాచుర్యంలోకి తేనున్న తితిదే

Intro:పాలకొల్లు పట్టణం: ఈస్టర్ వేడుకలు పట్టణంలో లో ఘనంగా నిర్వహించారు లజపతిరాయ్ పేట ఎడ్ల బజారు తదితర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ స్మశాన వాటిక లలో బంధుమిత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధులపై పూలు పండ్లు ఉంచారు.

Body:ఈస్టర్ వేడుకలు

Conclusion:ఘనంగా గా estren
Last Updated : Aug 20, 2019, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.