ఉల్లిపాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా.. శ్రీకాకుళంలో జిల్లాలో రాయితీపై ఉల్లిని సరఫరా చేస్తున్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబజారులో.. నేటి నుంచి 40 రూపాయలకే కిలో ఉల్లిపాయల విక్రయాలు చేపట్టారు. పది టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసిన మార్కెటింగ్ శాఖ.. ఒక్కరికి కిలో ఉల్లిపాయలు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఉల్లి కొనేందుకు వినియోగదారులు బారులు తీరారు.
ఇవీ చూడండి..