ఉల్లిపాయలకు ఎన్నడూ లేని విధంగా రేటు పెరగడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో జనం రాయితీ ఉల్లి కోసం ఎగబడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ క్యూలైన్లలో గంటల తరబడి ఉల్లి కోసం వేచి చూస్తున్నారు. ఇంతగా ఎదురు చూసినా ఉల్లి దొరకడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉల్లిని కొందరు వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉల్లిని అందరికీ అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: