శ్రీకాకుళం జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ సాగు, సరఫరా లేక మార్కెట్‌లో రోజురోజుకూ ధరలు హెచ్చుతున్నాయి. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిన కుటుంబాలకు పెరిగిన ధరలు మరింత భారంగా మారాయి. ఉల్లి ధరలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. బయట మార్కెట్లలో కిలో వంద రూపాయల వరకు పలుకుతుండటంతో కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రాయితీ ఉల్లి పంపిణీని తిరిగి ప్రారంభించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
ఉల్లే కాకండా మిగిలిన కూరగాయల ధరలకూ రెక్కలొచ్చి అందుబాటులో లేకుండా పోయాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుబజార్లలోనే అధిక ధరలుంటున్నాయని ఇక బయట మార్కెట్ల సంగతి చెప్పనక్కర్లేదని వాపోతున్నారు. ధరలు దిగొచ్చేదాకా రాయితీ ఉల్లి పంపిణీని కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. కరవు భత్యం పెంపు