పొట్టచేత పట్టుకుని జిల్లా కాని జిల్లాకు పనులకు వెళ్లారు. కొద్ది రోజులు పనులు చేసిన తర్వాత... కరోనా మహమ్మారి కోరల చాచడం మొదలుపెట్టింది. వైరస్ నివారణలో భాగంగా లాక్డౌన్ విధించారు. ఫలితంగా వీరికి పనులు దొరకలేదు. ఇన్నాళ్లు పనులు చేసి పోగు చేసుకున్న నగదు తినడానికే సరిపోయింది. లాక్డౌన్ ఇకనైనా ఎత్తేస్తారా అని చూశారు. కానీ ఆ అవకాశం ఉన్నట్టు కనిపించడం లేదు. చేసేదేమీ లేక సొంతూరు పయనమయ్యారు.
ఇక చేతిలో ఉన్న చిల్లర పట్టుకుని కాలినడకన సొంతూరుకు బయలుదేరారు. వాహనాలు దొరికిన చోట ఎక్కి... కొంత దూరం ప్రయాణించిన తర్వాత వీరి వద్ద డబ్బులు లేవని చెప్పగా వారు దించేశారు. చేసేదేమీ లేక కాలినడకన బయల్దేరారు. దారిలో దాతలు అందిస్తున్న ఆహారం తింటూ ముందుకు సాగుతున్నారు. అధికారులు, నేతలు స్పందించి తమను స్వస్థలానికి చేర్చాలని కోరుతున్నారు.
ఇదీ చదవండీ... 'కరోనా వైరస్ కట్టడికి ఇంటింటా సర్వే చేయండి'