ETV Bharat / state

ప్రభుత్వ భూములు కబ్జా...ముగ్గురిపై క్రిమినల్ కేసులు - నరసన్నపేటలో ప్రభుత్వ చెరువుల ఆక్రమణ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. చెరువులు, కాలువలను భూకబ్జాదారులు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్నారు. వీటిపై విచారణ చేపట్టిన ఆర్డీవో...ప్రాథమిక దర్యాప్తులో వాస్తవం అని తేలింది. కారకులైన ముగ్గురుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Occupying government ponds  in narasannapeta
కబ్జాకు గురైన స్థలంను పరిశీలిస్తున్న ఆర్డీఓ ఎన్.వి.రమణ
author img

By

Published : Feb 5, 2020, 11:34 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని దాలిహుండం చెరువు, బొజ్జల చెరువు, జోశ్యుల బంధ తదితర చెరువులు అక్రమణకు గురయ్యాయి. నరసన్నపేటకు చెందిన ఓ సినిమా థియేటర్ యజమాని చెరువులు పూర్తిగా కబ్జా చేసి..రియల్ ఎస్టేట్ దందాకు తెరతీశారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్​ వెంటనే ఆర్డీఓ ఎన్.వి.రమణను తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ ఆధ్వర్యంలో అధికారులు ఆక్రమణ ప్రాంతాలను పరిశీలించారు. దాదాపు రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇకపై ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆర్డీఓ ఎన్.వి.రమణ హెచ్చరించారు.

నరసన్నపేటలో కబ్జాదారుల హస్తంలో ప్రభుత్వ చెరువులు

ఇదీచూడండి.డిక్కీలో నగదు పెట్టి బజారుకెళ్లాడు.. తిరిగొచ్చేసరికి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.