ETV Bharat / state

ఎక్కడి వారు.. ఎంత మంది ఉన్నారు? - ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ

జిల్లా వ్యాప్తంగా విదేశాల నుంచి వచ్చిన వారు ప్రస్తుతానికి 476 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే 145 మంది ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో జిల్లాను జల్లెడ పడుతున్నారు అధికారులు.

ఎక్కడి వారు ..ఎంత మంది ?
ఎక్కడి వారు ..ఎంత మంది ?
author img

By

Published : Mar 30, 2020, 10:47 AM IST

కరోనా నియంత్రణ నేపథ్యంలో.. జిల్లా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య మండలాల వారీగా...

రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బాధితుల్లో విదేశాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉంటున్నారు. ఈ వివరాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా వైద్య, పోలీసు బృందాలు సేకరించిన వివరాలతో సరిపోల్చుకొని చూస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 476 మంది వచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు చేరుతున్న వారి సంఖ్యపై స్పష్టత రావడం లేదు.

ఇతర ప్రాంతాల నుంచీ ఎక్కువే...

విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు మాత్రమే సేకరించాలని ప్రభుత్వం చెబుతున్నా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పలు రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం నిఘా పెట్టింది. వలస కార్మికులు, ఇతర ఉద్యోగులు, చదువుకునేందుకు, పర్యాటకు ప్రాంతాలకు వెళ్లిన వారి.. అన్ని విభాగాల నుంచి వచ్చిన వారి లెక్కలు తేల్చే పనిలో పడింది. స్థానికంగా వాలంటీర్లు, పోలీసు, ఆశా, ఏఎన్‌ఎంల సహకారంతో వివరాలు సేకరిస్తోంది. వీరి సంఖ్య సుమారు 6వేల నుంచి 10వేల వరకు ఉంటుందని అంచనా.

స్వీయ నిర్బంధంలో..

విదేశాల నుంచి వచ్చిన వారిని పక్కాగా స్వీయ నిర్బంధంలోనే ఉంచుతూ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. వారి ఇళ్ల వద్ద నోటీసులు అంటిస్తూ గడువు దాటే వరకు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఎక్కడ పని చేశారు, చివరిగా ఎవరిని కలిశారు, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలేవైనా ఉన్నాయా లాంటి ప్రశ్నలను ఆరా తీస్తున్నారు. ఒక్కసారి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

జిల్లా కేంద్రంలోనే అధికం..

జిల్లా వ్యాప్తంగా విజయనగరం మండలంలోనే అత్యధికంగా 145 మంది విదేశాల నుంచి వచ్చిన వారున్నారు. బొబ్బిలి పురపాలిక, మండలంలో 33 మంది ఉన్నారు. జిల్లాకు వచ్చిన 476 మందిలో 155 మంది చిరునామాలు ఇప్పటికీ దొరకలేదు.

అతిక్రమిస్తే కేసులు...

విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరినీ నిర్బంధంలోనే ఉంచుతున్నాం. జిల్లాకు చెందిన వారు ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నాం. ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై అంటువ్యాధుల చట్టం కింద కేసులు నమోదు చేసే అధికారం పోలీసులకు ఉంది. ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించాం. వైద్యఆరోగ్య శాఖ, పోలీసు, పురపాలక, రెవెన్యూ విభాగాలన్నీ నిరంతర సేవలందిస్తున్నాయి.

- ఎస్‌వీ రమణకుమారి, డీఎంహెచ్‌వో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.