ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారనే విషయం పంచాయతీ ఎన్నికల ద్వారా తెలుస్తుందని ఆ పార్టీ నేత కూన రవికుమార్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళిని చూస్తే అర్థం అవుతుందన్నారు. విజయసాయిరెడ్డి ఎన్నికల ఫలితాలపై ట్విట్ చేసి వింతగా మాట్లాడుతున్నారన్నారు. పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు బెదిరిస్తున్నారని రవికుమార్ ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాం, మడపం గ్రామాల వద్ద నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోకి అక్రమంగా నాటుసారా, మద్యం రవాణా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా పెట్టాలని సూచించారు. గ్రామాల్లోకి అపరిచిత వ్యక్తులు రాకుండా కనిపెట్టాలని సూచించారు.
కొత్త పాలకవర్గం...
టెక్కలి మేజర్ పంచాయతీలో కొత్త పాలకవర్గం గురువారం కొలువుదీరింది. సర్పంచి గొండేల సుజాత, ఇతర వార్డు సభ్యులు కలసి ఉపసర్పంచ్‌గా 15వ వార్డులో గెలుపొందిన గండి విశ్వశాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులు నియామకపత్రాలను సర్పంచ్‌తో పాటు ఇతర వార్డు సభ్యులకు అందజేశారు. టెక్కలి మేజర్ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని కొత్త పాలకవర్గం తెలిపింది.
ఇదీ చూడండి. 'పోస్కోను రానివ్వం'.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల దీక్షలో నేతలు