శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిల్లాని ప్రాథమిక పాఠశాల అది. ఆ పాఠశాలలో 23 మంది విద్యార్ధులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఓ ఉపాధ్యాయుడు పదోన్నతిపై పొరుగూరుకు బదిలీ కాగా.. మరో ఉపాధ్యాయుడు డిప్యుటేషన్ కింద మరో ఊరికి వెళ్లారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరూ లేకపోవడంతో విద్యార్ధులు అయోమయంలో పడ్డారు. ప్రతిరోజు బడికి రావడం, టీచర్లు లేరని తిరిగి ఇంటికి వెళ్లడం రివాజుగా మారింది. ఈ విషయంపై విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉన్నతాధికార్లకు ఫిర్యాదు చేశారు. వారం రోజులు గడచినా టీచర్లు ఎవరు రాకపోవడంతో పాఠశాలకు తాళం వేసి..నిరసన తెలిపారు. తమ సమస్యపై జిల్లా కలెక్టర్, డిఈవో స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :