ETV Bharat / state

పింఛన్ల తొలగింపుపై వీడని స్తబ్దత...వేలాది మంది ఎదురుచూపు

author img

By

Published : Jul 5, 2020, 4:57 PM IST

శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో పింఛను తీసుకున్న వీరు ప్రస్తుతం తమకు ఎందుకు అందటం లేదో తెలియక ఆవేదనకు గురవుతున్నారు. ఇదే విషయమై ఎక్కడికక్కడ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ గోడు వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులను కలిసిన కొందరికి ఆయా జాబితాల్లో ఎందుకు తిరస్కరించారో పేర్కొన్న కారణాన్ని వివరిస్తున్నారు.

పింఛన్ల తొలగింపుపై వీడని స్తబ్దత...వేలాది మంది ఎదురుచూపు !

శ్రీకాకుళం జిల్లా నుంచి కొందరు పూర్తిగా వలస వెళ్లారని...కొందరి వయసు తక్కువగా ఉందని...మరణించిన వారి పేర్లూ జాబితాలో ఉన్నాయని ఇలా పలు కారణాలున్నాయని అధికారులు వివరిస్తున్నారు. అయితే...లబ్ధిదారుల వాదన మరోలా ఉంది. తమకు ప్రతి నెలా బియ్యం ఇస్తున్న వాలంటీర్లను అడిగినా తాము ఇక్కడే ఉన్న విషయాన్ని చెబుతారంటున్నారు. తమ వయసు ధ్రువీకరణ పత్రాలు చూపుతున్నా.. పట్టించుకోవడం లేదని మరికొందరు వివరిస్తున్నారు. తాము బతికే ఉన్నామని చెబుతున్నా...మరణించిన వారి జాబితాలో చూపారనే ఉదాహరణలూ ఉన్నాయి.

లబ్ధిదారులను గుర్తించేందుకు అవకాశం...

నవశకం సర్వే తరువాత వివిధ కారణాలతో పథకానికి దూరమైన వాస్తవ లబ్ధిదారులకు ‘వైఎస్‌ఆర్‌ పింఛను కానుక’ లబ్ధి చేకూర్చేందుకు మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వారు ఇచ్చిన పత్రాలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి మంజూరు చేస్తారు. ఇటీవల దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే అర్హుల పేర్లు జాబితాలో చేర్చుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది.

అర్హత పత్రాలు అందించి పొందొచ్చు ..

"రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘వైఎస్‌ఆర్‌ పింఛను కానుక’ను జిల్లాలో అర్హులందరికీ అందజేస్తాం. సచివాలయ సిబ్బందికి తమ అర్హత పత్రాలు అందజేసి లబ్ధిపొందవచ్ఛు వాస్తవ లబ్ధిదారులు తమ సమస్యలను తెలియజేస్తే క్షేత్రస్థాయి పరిశీలన చేసి తప్పకుండా న్యాయం చేస్తాం."

- బి.నగేష్‌, డీఆర్‌డీఏ పీడీ, శ్రీకాకుళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.