Youngster died in road accident: వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు... ప్రేమించడమే కాదు.. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.. రాత్రి సింహాచలంలో వివాహం చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జాతీయ రహదారిపై జరిగింది.
![పెళ్లైన 24 గంటలు గడవక ముందే..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15599339_291_15599339_1655605164087.png)
పోలీసులు, బంధువులు వివరాల ప్రకారం.. ఎల్.ఎన్.పేట మండలం పెద్ద కొల్లివలస గ్రామానికి చెందిన పవన్ కుమార్ తాపీమేస్త్రిగా పని చేస్తున్నాడు. అదే మండలం శ్యామలపురం గ్రామానికి చెందిన బలగ యోగేశ్వరి అనే యువతితో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. ఆరు నెలల కిందట పెద్దలను ఎదిరించి అమ్మాయిని తన సొంత గ్రామానికి తీసుకొచ్చాడు. అనంతరం వీరిద్దరూ సహజీవనం చేశారు. రెండు నెలలుగా రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు రాజీ ప్రయత్నాలు చేశారు. వారు చేసిన ప్రయత్నం ఫలించింది. దీంతో ఈ నెల 17 రాత్రి వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం పెళ్ళి కుమార్తె బంధువులు అందరూ బస్సులో స్వగ్రామానికి రాగా.. వరుడు, పెళ్లి కుమార్తె తండ్రి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. మృత్యువు దారి కాసి వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివాహం జరిగి 24 గంటలు గడవకముందే మృత్య ఒడికి చేరడంతో మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవీ చదవండి: