శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ప్రధాన రహదారిపైనే చేపల బజారు ఉండేది. అపరిశుభ్ర వాతావరణంతో నిత్యం అక్కడ ఇబ్బందికర పరిస్థితులే ఉండేవి. ప్రజలు నానాపాట్లు పడుతుండేవారు. అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఈ ప్రాంతం పాలకుల చొరవతో సుందరంగా మారింది. వ్యాపారులకు ఇబ్బందిలేకుండా చేపల మార్కెట్‌ను రైతు బజారు పక్కకు మార్చేశారు. 25 లక్షల నిధులు ఖర్చు చేసి అధునిక సదుపాయాలతో కొత్త బజారును తీర్చిదిద్దారు. 3 లక్షల రూపాయలతో పాత చేపల బజారుకు కొత్త రూపు ఇచ్చారు. మంచాలపేట రహదారి మీదుగా కోటబొమ్మాళి వైపు ప్రయాణించే బస్సులు నిలిపే ఆర్టీసీ సముదాయాన్ని నిర్మించారు. పాలకులు, అధికారులు తలంపుతో పని చేస్తే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి అనడానికి ఈ రెండే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
ఒకప్పుడు దుర్గంధ ప్రాంతం... నేడు సర్వాంగ సుందరం - developed
ఒకప్పుడు చేపల బజారు... నేడు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆర్టీసీ బస్టాండ్. గ్రామం మధ్యలో కంపుతో అటు వెళ్లాలంటే భయపడే జనం నేడు అక్కడ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. పాలకుల నిర్ణయాలు... అధికారుల కార్యదక్షతతో ఈ ప్రాంతం నలుగురికి నీడనిస్తోంది.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ప్రధాన రహదారిపైనే చేపల బజారు ఉండేది. అపరిశుభ్ర వాతావరణంతో నిత్యం అక్కడ ఇబ్బందికర పరిస్థితులే ఉండేవి. ప్రజలు నానాపాట్లు పడుతుండేవారు. అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఈ ప్రాంతం పాలకుల చొరవతో సుందరంగా మారింది. వ్యాపారులకు ఇబ్బందిలేకుండా చేపల మార్కెట్‌ను రైతు బజారు పక్కకు మార్చేశారు. 25 లక్షల నిధులు ఖర్చు చేసి అధునిక సదుపాయాలతో కొత్త బజారును తీర్చిదిద్దారు. 3 లక్షల రూపాయలతో పాత చేపల బజారుకు కొత్త రూపు ఇచ్చారు. మంచాలపేట రహదారి మీదుగా కోటబొమ్మాళి వైపు ప్రయాణించే బస్సులు నిలిపే ఆర్టీసీ సముదాయాన్ని నిర్మించారు. పాలకులు, అధికారులు తలంపుతో పని చేస్తే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి అనడానికి ఈ రెండే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:FTP lo vachindi