శ్రీకాకుళంలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్పీ కార్యాలయం నుంచి సూర్యమహల్ కూడలి వరకు జరిగిన ర్యాలీని ఎస్పీ అమ్మిరెడ్డి ప్రారంభించారు. వారం పాటు మోటారు వాహనాల చట్టంపై ప్రజల్లో అవగాహన పెంపొందించటానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ప్రజలు పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి: