ETV Bharat / state

ఆనందోత్సాహాల న‌డుమ నాగుల‌ చ‌వితి - nagula chavithi

రాష్ట్ర వాప్తంగా నాగుల చవితిని పురస్కరించుకుని.. ఆలయాల్లో సందడి నెలకొంది. భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ పండ‌గ‌ను ఆచ‌రిస్తున్నామ‌ని భ‌క్తులు తెలిపారు.

state wisw nagula chavithi
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నాగుల చవితి
author img

By

Published : Nov 18, 2020, 2:54 PM IST

శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో నాగుల చవితి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పుట్ట వద్ద మహిళలు చిన్నారులు కలిసి పూజలు నిర్వహించారు. పాముల పుట్టకు అలంకరణ చేసి పూజలు చేశారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తన స్వగ్రామం పోలాకి మండలం మబగాం గ్రామంలో పుట్టలో పాలు పోశారు. కుటుంబ సమేతంగా ఆయన నాగుల చవితి కార్యక్రమాన్ని చేసుకున్నారు.

విజయనగరం జిల్లా

విజయనగరం పార్లమెంట్ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్... తన కుటుంబ సభ్యులతో చీపురుపల్లి మండలం నాగంపేటలోని తన వ్యవసాయ క్షేత్రం వద్ద నాగుల చవితి పూజలు చేశారు.

విశాఖ జిల్లా

నర్సీపట్నంలో పలువురు ప్రముఖులు నాగ పూజలు చేశారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తమ పొలంలోని పుట్ట దగ్గర.. ఆయన సతీమణి పద్మావతి, కుమారులతో కలిసి పుట్టలో పాలు పోశారు.

ఆంధ్ర విశ్వ‌విద్యాలయంలో ఇంజి‌నీరింగ్ కళాశాల, ద‌క్షిణ క్యాంప‌స్​లు పెద్ద ఎత్తున భ‌క్తుల‌తో ర‌ద్దీగా మారాయి. పోర్టు స్టేడియం, విశాలాక్షి న‌గ‌ర్ పోలీసు స్టేడియం, అడ‌వి వ‌రం, కైలాస‌పురం, మ‌ర్రిపాలెం, కంచ‌ర‌పాలెం, సాగ‌ర్ న‌గ‌ర్, కూర్మ‌న్న‌పాలెంలలో పుట్ట‌ల వ‌ద్ద భ‌క్తులు పూజ‌లను నిర్వ‌హించారు. హైంద‌వ సంప్ర‌దాయంలో ప్ర‌కృతిని అందులో భాగంగా ఉన్న నాగేంద్రుడిని ఏటా కొల‌వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని, కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ఈ పండ‌గ‌ను ఆచ‌రిస్తున్నామ‌ని భ‌క్తులు తెలిపారు.

పాయకరావుపేట ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్​సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు కుటుంబ సమేతంగా పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపారు.

అనకాపల్లిలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు పొలాల్లోకి వెళ్లి పుట్టలో పాలు పోసి నాగేంద్రునికి ప్రత్యేక పూజలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా

రంపచోడవరం మన్యంలో నాగుల చవితి పండగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు పుట్టలో పాలు, గుడ్లు, నైవేద్యం పెట్టి పూజలు చేశారు.

రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గల్లో నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే దివాన్ చెరువు ఫారెస్ట్, తోటల్లో పుట్టలు వద్ద పాలు పోసి మొక్కులు తీర్చికున్నారు.

కృష్ణాజిల్లా

పెనుగంచిప్రోలులో ఘనంగా నాగుల చవితి వేడుకలు జరుగుతున్నాయి. స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు.

విజయవాడ నగర శివారు పాయికాపురం నాగేంద్రస్వామి ఆలయంలో నాగుల చవితి పర్వదినాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి వందలాదిగా మహిళలు, భక్తులు ఆలయానికి చేరుకొని నాగేంద్రస్వామి పుట్టలొ పాలుపొసి మొక్కులు తీర్చకున్నారు.

గుంటూరు జిల్లా

పెదనందిపాడు మండలం నాగులపాడులో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు నిర్వహించారు. స్వామిని శోభాయమానంగా పూలతో అలంకరించారు. దూర ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వామికి పాలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించి...పొంగళ్లు చేసి నైవేద్యం సమర్పించారు.

ప్రకాశం జిల్లా

కనిగిరి నియోజకవర్గంలో 6 మండలాల్లోని దేవాలయాల్లో వెలసి ఉన్న పుట్టల్లో...పొలాల దగ్గర ఉన్న పుట్టల్లో పాలు పోశారు. నాగుల విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి నైవేద్యం సమర్పించి...మొక్కులు తీర్చుకున్నారు.

నెల్లూరు జిల్లా

సంగం మండలం కోలగట్లలో వెలసివున్న నాగార్పమ్మ ఆలయం భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. నాగుల చవితి పర్వదినాన ముస్లిం కుటుంబం నాగార్పమ్మను అలంకరించి భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

నాయుడుపేట రైల్వే స్టేషన్ క్వార్టర్స్ ఆవరణలోని అతి పెద్ద పుట్ట వద్ద నాగుల చవితితో భక్తులు పోటెత్తారు. ఎత్తైన పుట్టను ఎక్కువ మంది చేరుకుని పూజలు నిర్వహించారు.

చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నాగల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరలయ ప్రాంగణంలో వెలిసిన నాగదేవత ప్రతిమలకు భక్తులు పూజలు చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని...నాగదేవత ప్రతిమల వద్ద పాలు, పసుపు, కుంకుమ అభిషేకాలు నిర్వహించి పూజలు జరిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు.

ఇదీ చదవండి:

ఫోన్​ చూస్తే తండ్రి తిడుతున్నాడని కుమారుడి కిడ్నాప్ డ్రామా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.