25 పార్లమెంట్ స్థానాలకు 25 జిల్లాలు అసంబద్ధ ఆలోచన అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయ కారణాలతో జరిగే కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అవసరమైన చోట మాత్రమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా విభజన జరిగితే ఉనికి, ఉపాధికీ నష్టమని వ్యాఖ్యానించారు. 2026లో పునర్విభజనతో పార్లమెంట్ స్థానాలు పెరిగితే ఏం చేస్తారు? అని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'అబ్దుల్ కుటుంబ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే నైతిక బాధ్యత'