రాజధాని అమరావతి కోసం రైతులు శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యకం చేశారు. ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అమరావతి రైతుల అరెస్టుపై మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గుండ లక్ష్మీదేవితో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు నిరసన చేపట్టారు. డీఆర్ఓ దయానిధికి వినతి పత్రం అందజేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు దుయ్యబట్టారు. రైతుల అక్రమ అరెస్టుకు సహకరించిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: