శ్రీకాకుళంలోని సంతబొమ్మాళి - కోటబొమ్మాళి రహదారి సమీపంలో ఉన్న బస్ స్టేషన్ ప్రక్కన.. వైఎస్సాఆర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన మంత్రి సీదిరి అప్పలరాజుకు చుక్కెదురైంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థలం తనదని.. ఓ వ్యక్తి అభ్యంతరం తెలిపారు. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయవద్దని చెప్పారు. ఫలితంగా... మంత్రి అక్కడి నుంచి వెనుతిరగవల్సి వచ్చింది. దీంతో వైకాపా కార్యకర్తలు నిరాశ చెందారు.
ముందుగా సంతబొమ్మాళిలోని పాలేశ్వరస్వామి ఆలయంలో నందేశ్వరస్వామి విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అభద్రతా భావం సృష్టించడానికే తెదేపా కుట్రలు చేస్తోందని విమర్శించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడడం శోచనీయమన్నారు.
ఇదీ చదవండి: