Minister Sidiri Appalaraju Is Facing Issuie: శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుకు అసమ్మతి నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. అసమ్మతి నేతల తీరుతో మంత్రి అప్పలరాజుకు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. ఈ నెల 18వ తేదీన పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో.. రూ.100 కోట్లతో సమగ్ర నీటి సరఫరా పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కానీ ఆ శిలాఫలకంలో సీఎం జగన్ పేరు లేకపోవడం బాధ కలిగిస్తోందంటూ.. వైసీపీ పలాస పట్టణ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం పాత దానిని తొలగించి, ముఖ్యమంత్రి పేరుతో నూతన శిలాఫలాకాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
"100 కోట్ల ప్రాజెక్ట్ ఇది.. ఖచ్చితంగా ముఖ్యమంత్రి పేరు ఉండాలి.. ఆయన పేరు లేకపోవడం చాలా బాధాకరం..ఇప్పటికైనా శిలాఫలకాన్ని తొలిగించి.. ఇంకో శిలాఫలకంపై ప్రధానంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉండాలని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పట్టణాధ్యక్షుడిగా కోరుకుంటున్నాను.." దువ్వాడ శ్రీకాంత్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఇవీ చదవండి: