శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని శివానందగిరిని మంత్రి సీదిరి అప్పలరాజు దంపతులు దర్శించుకున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీ త్రినాధ స్వామి ఆలయ పునః ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ యువజన సేవా సంఘ సభ్యులు శాస్త్రోక్తంగా మంత్రికి స్వాగతం పలికారు.
శ్రీ విజయ గణపతి, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ త్రినాథ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి దంపతులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొండపై 43 అడుగుల ఎత్తుతో నిర్మించిన శివపార్వతుల విగ్రహాలను ఆవిష్కరించారు.
విశాఖపట్నం కైలాసగిరి స్ఫూర్తిగా ఇచ్ఛాపురంలో శివానందగిరిని అభివృద్ధి చేయడం ఆనందదాయకమని మంత్రి అప్పలరాజు అన్నారు. ఈ క్షేత్ర అభివృద్ధికి 20 ఏళ్లుగా శ్రమిస్తున్నారని, ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో మౌలిక వసతులు నెలకొల్పారని చెప్పారు. శివానందగిరిని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తరఫున సహకారాన్ని అందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి