రాష్ట్రంలో ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. కొన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని.. కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ వాదనలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజలందరికీ కోవిడ్ వాక్సిన్ అందించడానికి రూ. 1600 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇవీ చదవండి: