శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడికి వెళ్లారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన బీటెక్ విద్యార్థి నగేష్ మృతిపై బంధువులు ఆందోళన చేస్తుండగా.. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
రణస్థలం వద్ద బుధవారం అనుమానాస్పదస్థితిలో సజీవ దహనమైన విద్యార్థి నగేష్ విషయాన్ని.. కళాశాల యాజమాన్యంతో పాటు పోలీసులు పట్టించుకోవడం లేదని మృతుడి బందువులు ఆరోపిస్తున్నారు. కళాశాలను చుట్టుముట్టి అద్దాలు ధ్వంసం చేశారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఇదీ చదవండి: