ETV Bharat / state

పార్టీలకతీతంగా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు: మంత్రి ధర్మాన

పేదలందరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నామని మంత్రి ధర్మాన అన్నారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్‌ రెడ్డి నిరుపేదల పక్షపాతి అని ఆయన పేర్కొన్నారు.

ధర్మాన
author img

By

Published : Oct 4, 2019, 5:14 PM IST

మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రసంగం

పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందచేస్తున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారి కుటుంబాలకు చేయూతనివ్వడానికి అనేక పథకాలను రూపకల్పన చేస్తున్నామని మంత్రి తెలిపారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి వారసునిగా జగన్ పేదలందరికీ పథకాలను అందిస్తున్నారన్నారు. వైఎస్ఆర్‌ వాహన మిత్ర నమోదులో శ్రీకాకుళం జిల్లా 2వ స్థానంలో ఉండటం హర్షదాయకమన్నారు. ఓనర్‌ కమ్‌ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించి వారిని ఆదుకుంటున్నామన్నారు. జిల్లాలో 10,452 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. నీతివంతమైన పాలన అందిస్తున్నందున అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఈనెల 15న రైతు భరోసా క్రింద రూ.12,500లను అందించనున్నట్లు తెలిపారు.

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ నియోజకవర్గం,
బేలుగుప్ప మండలం.

కారువు ప్రాంతాల్లో మల్బరీ సాగు ద్వారా పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

పట్టు పురుగుల పెంపకంలో నూతన విధానాలను అవలంబిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు అనంతపురానికి చెందిన ఓ రైతు. జిల్లాలోని బెలుగుప్ప మండలం దుద్దేకుంటకు చెందిన రైతు పెద్దన్న అతి తక్కువ పెట్టుబడితో పట్టుపురుగుల పెంపకాన్ని చేపడుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండు సంవత్సరాల కిందట మల్బరీ సాగులోకి ప్రవేశించిన పెద్దన్న ఆ రంగంలో అనతికాలంలోనే తన ముద్ర వేశారు. దాదాపు 15 ఎకరాల్లో మల్బరీ పండిస్తూ ప్రతి పంటకు రెండు లక్షలకు పైగా లాభాన్ని ఆర్జిస్తున్నారు. ఇలా సంవత్సరానికి 11 నుంచి 12 పంటలను తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన సాగు విధానాలను తెలుసుకోవడానికి బీహార్, తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, రాష్ట్రాలకు చెందిన రైతులు వస్తున్నారు.

*మల్బరీ పెంపకం*

పట్టు పురుగుల పెంపకంలో ప్రధానమైంది మల్బరీ తోటల పెంపకం. మల్బరీ ఆకుల నాణ్యత బాగుంటేనే పంట నాణ్యత బాగుండేది. దీని కోసం పెద్దన్న నూతన విధానాలను అవలంభిస్తున్నారు. 7×3×2 ప్రకారం జోడుసాళ్ళ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీని ద్వారా మల్బరీ ఆకులు చాలా మెత్తగా వస్తాయని ఆయన చెబుతున్నారు. మొక్కలను కత్తిరించిన తరువాత పోగయ్యే వ్యర్థాలను వేస్ట్ డీకంపోజర్ పద్ధతిని ఉపయోగించి వర్మి కంపోస్టుగా మారుతున్నారు. దీని ద్వారా ఎరువులకు పెట్టాల్సిన పెట్టుబడి చాలా వరకు తగ్గిపోతుందని చెపుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో మల్బరీ సాగు చేసి అనుకున్న స్థాయిలో దిగుబడి సాధిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

*పట్టు పురుగుల పెంపకం*

పట్టు పురుగులను కన్నబిడ్డల కన్నా ఎక్కువగా చూసుకోవాలని పెద్దన్న చెబుతున్నారు. ఏమాత్రం అశ్రద్ధ వహించిన పురుగులు చనిపోయే ప్రమాదం ఉంటుంది అన్నారు. ముఖ్యంగా పట్టుపురుగుల షెడ్డు లో ఉష్ణోగ్రతను పాటించాలని దీనికోసం ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారు పేర్కొన్నారు.

Body:
బైట్ 1 : పెద్దన్న, రైతు.
బైట్ 2 : రాజేంద్రప్రసాద్, రైతు.
బైట్ 3 : మల్లికార్జున, రైతు.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, ananthapuram.
date : 03-10-2019
sluge : JK_AP_ATP_71_03_malbari_success_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.