ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో.. లేదో..! : మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు

MINISTER DHARMANA VIRAL COMMENTS: మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం నగరంలోని పీఎస్‌ఎన్‌ఎంహెచ్‌ పాఠశాలలో ‘జగనన్న ఆసరా’ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన స్వయంశక్తి సంఘాల మహిళలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.

MINISTER DHARMANA VIRAL COMMNETS
MINISTER DHARMANA VIRAL COMMNETS
author img

By

Published : Apr 4, 2023, 1:44 PM IST

Updated : Apr 4, 2023, 9:48 PM IST

MINISTER DHARMANA VIRAL COMMENTS: వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానో.. చేయనో తెలియదని.. దానికి ఇంకో సంవత్సరం సమయం ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం PSNM పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే కొందరు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మీ ఆత్మ విశ్వాసం పెంచేలా కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఆలోచించాలన్న ధర్మాన.. ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ‘మొన్న ఓ చోట జగనన్న ఆసరా పంపిణీ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తూ ఓ మహిళ.. ఆసరా డబ్బులు జగన్‌ ఇంట్లోంచి ఇచ్చేస్తున్నాడా అంటోంది. తిన్నది తిరగబోసుకోవడం అంటే ఇదే. సంస్కారం లేకపోతే ఎలా? ఏం మనుషులో ఏంటో.. పద్దుకు మాలిన వ్యక్తుల్లా మాట్లాడితే ఎలా’ అని ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన స్వయం శక్తి సంఘాల మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నిత్యావసరాల ధరలు గురించి మాట్లాడుతూ.. ‘ఒకరు రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ప్రచారం చేస్తారు. ధరలు పెరగడానికి, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి సంబంధమేంటి? ధరలు దేశంలో అన్ని ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. జగన్‌కు ప్రజల్లో ఉన్న ప్రేమ, ఆదరణను తగ్గించేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారమిస్తే మోసం చేసిన విషయం మీకు తెలిసిందే. ఇచ్చిన హామీని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది’ అని మంత్రి పేర్కొన్నారు.

గోడ దూకి బయటకు వచ్చిన మహిళలు: మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు మధ్యలో వెనుదిరగకుండా నిలువరించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పీఎస్‌ఎన్‌ఎంహెచ్‌ పాఠశాలలో సమావేశం ముగిసేవరకు గేటుకు తాళం వేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన వారు గోడ దూకి బయటకు వచ్చారు. అధికారులకు శాపనార్థాలు పెట్టారు.

మంత్రి ధర్మాన ప్రసాద రావు తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నిన్న రాగోలులో మంత్రి ప్రసంగిస్తుండగా కొందరు మహిళలు బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే దానిపై ఆయన స్పందిస్తూ.. ఏయ్‌ తల్లీ ఆగండమ్మా.. మీటింగ్​ ఐదు నిమిషాల్లో అయిపోద్ది. వెళ్లిపోదూరు. ఒరేయ్‌.. ఆటోలు తీయకండి. స్టార్ట్‌ చేయకండి.. అని తదుపరి ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే మంత్రి సరదాగా మాట్లాడుతున్న అని చెప్తున్నా కానీ.. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అంతకుముందు ఏప్రిల్​ 2వ తేదీన శ్రీకాకుళం టౌన్‌హాల్‌లో ఆస‌రా ప‌థ‌క ల‌బ్ధిదారుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగించారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఓ గేటు తాళం ఎవరో తీశారు. దాంతో మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి.. గేటు తాళాలు ఎవరూ తీశారో.. వాడి గూబ మీద ఒకటి కొట్టండి.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 4, 2023, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.