ETV Bharat / state

MINISTER SEEDIRI : 'తీర ప్రాంత జిల్లాల్లో.. ఒక్కో హార్బర్ ఏర్పాటు చేస్తాం' - srikakulam district news

రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో ఒక్కో హార్బర్ ఏర్పాటు చేయనున్నట్లు...మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పడపానిపేట-సుంకరపాలెం వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.

మంత్రి సీదిరి అప్పలరాజు
మంత్రి సీదిరి అప్పలరాజు
author img

By

Published : Dec 30, 2021, 9:41 PM IST

రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో.. ఒక్కో హార్బర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ఉప్పు గెడ్డపై నిర్మించిన పడపానిపేట-సుంకరపాలెం వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ కొచ్చి, ఎంఓసీఐ, జిల్లా నిధులతో ఈ వంతెన నిర్మించనున్నారు.

ఈ వంతెన నిర్మాణం పూర్తయితే.. సుమారు పది గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జిల్లాలో 1,336 హెక్టార్లలో మత్స్య సంపదను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

అంతే కాకుండా.. మరో 1,300 హెక్టార్లలో మత్స్య సంపదను అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. ఆక్వా రంగం ద్వారా రాష్ట్రానికి రూ.58 వేల కోట్ల ఆదాయం వస్తుందన్న మంత్రి.. రాష్ట్రంలో ఉన్న మత్స్యకార మహిళలు గౌరవప్రదమైన వ్యాపారులు కావాలని ఆకాంక్షించారు.

ఇదీచదవండి :

accident : మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం.. బైక్​తో ఢీకొట్టడంతో ఒకరి మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.