శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కె.కొత్తూరు సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం వద్ద వలస కూలీలు ఆందోళన చేశారు. తాము కేంద్రానికి వచ్చి 23 రోజులు దాటినా విడిచిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత గడువు దాటిందని బ్యాగులు సర్దుకుని వారి సొంత గ్రామాలకు బయలుదేరారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కేంద్రంలో వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న కారణంగా.. మిగిలిన వారి నుంచి 2 సార్లు నమూనాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాలని, ఫలితాలు వచ్చిన వెంటనే విడిచి పెడతామని సముదాయించారు. టెక్కలి తహసీల్దార్ కె.శ్రీరాములు, రెండో ఎస్సై గోపాలరావు కేంద్రానికి చేరుకుని వలస కూలీలను నిరోధించారు.
ఇవీ చదవండి: