రక్తదానం చేసేందుకు యువత ముందుకురావాలని శ్రీకాకుళం జిల్లా జేసీ సుమిత్‌కుమార్ అన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, అవసరమైన రక్తనిల్వలు లేవని అన్నారు. యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదాన కార్యక్రమానికి గ్రామ, వార్డు వాలంటీర్లు ముందుకురావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:
దామోదరం సంజీవయ్య జీవితం నుంచి ఎంతో నేర్చుకోవాలి: జస్టిస్ ఎన్.వి.రమణ