ఇదీ చదవండి :
ఏవోబీలో తుపాకీ గర్జన... భారీగా మావోయిస్టుల సామగ్రి లభ్యం - ఏఓబీల కాల్పులు వార్తలు
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన బోండాఘాట్లో పోలీసులు మావోయిస్టుల మధ్య బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నా సమాచారంతో కూంబింగ్ చేశామని కొరాపుట్ డీఐజీ షఫీన్ అహమ్మద్ తెలిపారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని... ప్రతిగానే తాము స్పందించామన్నారు. మావోయిస్టులు తప్పించుకున్నారని... వారి సామగ్రి లభించిందని వివరించారు.
ఏవోబీలో కాల్పులు... భారీగా మావోయిస్టుల సామాగ్రి లభ్యం
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ప్రాంతమైన బోండాఘాట్లో బుధవారం పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ వివరాలను కొరాపుట్ డీఐజీ షఫీన్ అహమ్మద్ మీడియాకి తెలిపారు. ఈ నెల 15న ముదులిపడ పోలీసు స్టేషన్ పరిధిలోని గలా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ చేశామన్నారు. పోలీసులకు మల్కాన్ గిరి జిల్లా ఎస్పీ రిసికేశ్ డి కిల్లరి నేతృత్వం వహించారని చెప్పారు. గోయిగూడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయన్నారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో గాలింపు చేపట్టగా భారీ సంఖ్యలో మావోయిస్టుల సామగ్రి దొరికిందని డీఐజీ చెప్పారు. ఈ ఘటనలో మావోయిస్టులకు గాయాలై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుందని డీఐజీ షఫీన్ అహమ్మద్ తెలిపారు.
ఇదీ చదవండి :
Intro: ఆంధ్ర ఒడిశా సరిహద్దు లో గల బోండాఘాట్ లో మావోయిస్టులు కు పోలీసులు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కొరాపుట్ డిఐ జీ షఫీన్ అహమ్మద్ కే శుక్రవారంనాడు పత్రిక విలేకరులకు తెలిపారు.ఈ నెల 15 న ముదులిపడ పోలీస్ స్టేషన్ పరిధి లో గలా అటవీ ప్రాంతం లో మావోయిస్టు సంచరిస్తూ నట్లు సమాచారం అందింది.Body:మల్కాన్ గిరి జిల్లా sp హ్రిసికేశ్ డి కిల్లరి నేతృత్వంలో బుధవారం నాడు కూoబింగ్ నిర్వహించారు. గోయిగూడా అటవీ ప్రాంతంలో మావోయిస్టు లకు పోలీస్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులు అనంతరం ఘటన స్థలం లో గాలింపు చేపట్టగా భారీ సంఖ్య లో మావోయిస్ట్ సామగ్రి దొరికింది.Conclusion:ఈ ఘటన లో మావోయిస్ట్ లకు గాయాలు ఐ ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికి కూoబింగ్ కొనసాగుతున్నట్లు తెలిపారు.