లాక్డౌన్తో స్తంభించిపోయిన పరిశ్రమలను తెరిచేందుకు ప్రభుత్వ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆహార పదార్థాలు ప్యాక్ చేసేందుకు అవసరమయ్యే కాగితం అట్టలు అందుబాటులో లేకపోవడంతో రవాణా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు కాగితపు పరిశ్రమలను తెరిపించాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మండపం వద్ద వంశధార పేపర్ మిల్లును తెరిచేందుకు సహకరించాలంటూ గ్రామస్థులను... శ్రీకాకుళం ఆర్డీఓ ఎన్.వి.రమణ అధ్యక్షతన అధికారులు కోరారు. కరోనా భయంతో.. పరిశ్రమను తెరిపించేందుకు వీలులేదని గ్రామస్తులంతా ఏకపక్షంగా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంటే.. దానికి విరుద్ధంగా ఎలా చేస్తారని అధికారులను నిలదీశారు.
ఇదీ చదవండి: