ETV Bharat / state

మద్యం మత్తులో కారు నడిపాడు.. జనాలను హడలెత్తించాడు

author img

By

Published : Sep 5, 2020, 7:48 AM IST

మద్యం మత్తులో కారు నడిపాడు.. జనాలను హడలెత్తించాడు. అడ్డొచ్చినవారిని గుద్దుకుంటూ వెళ్లి బీభత్సం సృష్టించాడు. తాగిన మత్తులో కళ్లు కానక.. ఎంతో మందిని గాయపరిచాడు.

man hit several people at srikakulam district
మద్యం మత్తులో కారు నడిపాడు.. జనాలను హడలెత్తించాడు

శ్రీకాకుళం జిల్లాలో పూటుగా తాగి.. కారు నడపటంతో మూడు మండలాల్లోని జనం హడలిపోయారు. పార్వతీపురం నుంచి మొదలైన ప్రస్థానం వంగర మీదుగా రాజాం వరకు కొనసాగింది. వంగర నుంచి రాజాం వస్తుండగా సరసనాపల్లి సమీపంలో చెట్టుకు ఢీకొనడంతో స్థానికులు భీతిల్లిపోయారు. ప్రమాదవశాత్తు జరిగిందనుకొని వారు సాయం కోసం వెళ్లగా కారులోని ఇద్దరు వ్యక్తులు బాగా తాగి ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల రాకతో వాహనాన్ని అంతే వేగంతో ముందుకు ఉరికించారు. వంగర మండలం అరసాడ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొన్నారు. అలానే బూరాడ కూడలి వద్ద సైకిల్‌పై వెళ్తున్న రాజాం వాసి శ్రీరామ్‌ను ఢీకొన్నారు.

అక్కడి నుంచి జీఎమ్మార్‌ఐటీ సమీపంలో రేగిడి మండలం లక్ష్మీపురం వాసి అనిల్‌కుమార్‌ను ఢీకొట్టారు. మరికాస్తా ముందుకు వెళ్లి రేగిడి మండలం ఏవీపురం వాసి సురేశ్‌ను ఢీకొట్టారు. స్థానికులు గుర్తించి కారులోని వారిని నిలువరించారు. పోలీసులకు సమాచారం అందించటంతో రాజాం గ్రామీణ సీఐ డి.నవీన్‌కుమార్‌ సంఘటనా స్థలాలను పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను రాజాంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాజాం ఏఎస్‌ఐ అడవన్న కేసును నమోదు చేశారు. సంతకవిటి పోలీసు స్టేషన్‌కు కేసును బదిలీ చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: రైతులు లబ్ధి పొందేలా చర్యలు తీసుకోండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.