ETV Bharat / state

అనుభవజ్ఞుడు కావాలా.. 'నేరస్థుడు' కావాలా? - సార్వత్రిక ఎన్నికలు 2019

శ్రీకాకుళం జిల్లా పొందూరులో తెదేపా ఎన్నికల ప్రచారసభకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. నేరప్రవృత్తి ఉన్నవాళ్లు ముఖ్యమంత్రి అయితే.. శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని చెప్పారు. తెదేపానే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Minister Lokesh
author img

By

Published : Mar 26, 2019, 7:50 PM IST

Minister Lokesh
పసుపు కుంకుమ పథకంతో ఆత్మగౌరవం కాపాడేవారు కావాలా... పసుపు కుంకుమలు తీసేవాళ్లు కావాలా... అంటూ శ్రీకాకుళం జిల్లా పొందూరు ప్రజలను మంత్రి లోకేష్ ప్రశ్నించారు. పొందూరు శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి రవికుమార్, శ్రీకాకుళం లోక్​సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి రామ్మోహన్ నాయుడు తరఫున లోకేష్ ఎన్నికల ప్రచారం చేశారు. 40 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వాన్ని మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. జగన్ లాంటి నేరప్రవృత్తి ఉన్నవాళ్లు ముఖ్యమంత్రి అయితే.. శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే తెదేపా అభ్యర్థులనే ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.