ETV Bharat / state

నాటుసారా, అక్రమ మద్యంపై పోలీసుల ఉక్కుపాదం - liqour seized by police in hiramandalam

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. మద్యం సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుని.. నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

liqour seized by police in some coastal districts
మూడు జిల్లాల్లో అక్రమ మద్యం స్వాధీనం
author img

By

Published : Mar 14, 2020, 9:42 PM IST

మద్య నియంత్రణ చర్యలు వివరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు

మద్యం రహిత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మద్య నిషేధ అబ్కారీ శాఖ ఉప కమిషనర్‌ బి.అరుణ్‌రావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఎక్సైజ్​ సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఎన్నికల కోడ్​ సమయంలో పాటించాల్సిన నిబంధనలు, నేరాలు జరిగే తీరును వివరించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యాన్ని తరలించకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రకటన విడుదలైన నాటినుంచి ఇప్పటివరకూ 181 కేసులు నమోదు చేసి 139 మందిని అరెస్టు చేశామన్నారు. 121 మందిపై బైండోవర్‌ కేసులు పెట్టినట్లు అరుణ్‌రావ్‌ చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో తనిఖీలు...

పశ్చిమగోదావరి జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు జీలుగుమిల్లి వద్ద తనిఖీలు చేశారు. సరిహద్దులోని అశ్వారావుపేట నుంచి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని వీరంపాలెం గ్రామానికి తరలిస్తున్న 240 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

మరో మార్గంలో మద్యం తరలిస్తున్న రెండు మోటార్ సైకిళ్లను, 80 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా.. సుమారు 3 లక్షల రూపాయల విలువ గల 320 మద్యం సీసాలు, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎక్సయిజ్ అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం రవాణాపై గట్టి నిఘా పెట్టామని ఎక్సయిజ్ సీఐ తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని మామిడిజాలలో నాటుసారా స్థావరాలను పోలీసులు ధ్వంసం చేశారు. పాతపట్నం సీఐ రవి ప్రసాద్​ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

ఇదీ చదవండి:

'నాటు సారా తయారీ, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.