శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం రొంపివలస గ్రామానికి చెందిన మహంతి రమణమ్మ(35) అనే మహిళ పాముకాటు గురై మృతి చెందింది. ఈ నెల 22న పొలంలో ఉన్న ఆవును తీసుకువస్తున్న సమయంలో పాముకాటు వేసింది. శనివారం విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు చిన్న పిల్లలు తల్లి మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు చూసి గ్రామస్థులు కంటతడి పెడుతున్నారు. ప్రస్తుతం మృతురాలు పాఠశాల కమిటీ చైర్మన్గా ఉన్నారు.

ఇదీ చదవండి :