ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో.. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి పూర్తి స్థాయిలో.. జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ఆదేశాల మేరకు.. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో కర్ఫ్యూ కట్టుదిట్టం చేశారు.
అత్యవసర వాహనాల రాకపోకలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సినిమా హాళ్లు, దుకాణాలు పూర్తి స్థాయిలో మూసివేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి రాకూడదని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: