రాజకీయ కార్యకలాపాల్లో ఉద్యోగులు పాలు పంచుకుంటున్నారని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం కూన రవికుమార్ మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన వైకాపా పాదయాత్రలో ఉద్యోగులు పాల్గొన్నారని ఆధారాలతో సహా బహిర్గతం చేశామన్నారు.
పొందూరు, బూర్జ ఎంపీడీవోలు బాధ్యతారహితంగా పాలుపంచుకోవాలని సిబ్బందిని ప్రోత్సాహించేలా అదేశాలు జారీ చేశారన్నారు. కనీసం జిల్లా పరిపాలన అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమేనన్నారు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాలని కూన రవికుమార్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు