ETV Bharat / state

రేషన్ పంపిణీ చేయాలని గ్రామస్థుల నిరసన

జనవరి నెలలో ఇవ్వాల్సిన రేషన్ సరుకులు ఇప్పటిదాకా ఇవ్వలేదని శ్రీకాకుళం జిల్లా కొత్తపల్లి గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లు తమకు రావల్సిన సరుకులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

kothapally villagers protest
రేషన్ పంపిణీ చేయాలని గ్రామస్థుల నిరసన
author img

By

Published : Mar 7, 2021, 6:27 PM IST

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామస్థులు జనవరి నెల రేషన్​ సరుకులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లు తమకు రేషన్ సరుకులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 800 వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. 14 మంది వాలంటీర్లు జనవరిలో తమకు ఇవ్వాల్సిన బియ్యం, ఇతర సరకులు పక్కదారి పట్టించారని వారంతా ఆరోపించారు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని... బయట దుకాణాల్లో సరకులు కొనుక్కునే స్థోమత లేదని లబ్ధిదారులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

జగన్​ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది: రామ్మోహన్​నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.