కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో కరోనా లేదనే భ్రమలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కరోనాపై కేంద్రానికి తప్పుడు లెక్కలు ఇచ్చారని ఆరోపించారు. లాక్డౌన్ నిబంధనలు వైకాపా నేతలకు వర్తించవా అని నిలదీశారు. హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా... ప్రభుత్వంలో మార్పు రావడంలేదని మండిపడ్డారు. పాలకుల అసమర్థత వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్న అయన... కేంద్రం ఇచ్చిన కరోనా సాయాన్ని వైకాపా నేతలు ఇచ్చినట్టు ఫోజులిచ్చారని దుయ్యబట్టారు. ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్