శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కొండవలస గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన బ్యాలెట్ బాక్స్‌లు అపహరణ కేసులో 34 మందిని అరెస్ట్ చేసినట్టు పాలకొండ డీఎస్పీ శ్రావణి తెలిపారు. కొండవలస పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు అనంతరం తర్వాత కొంతమంది వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోనికి చొరబడి 8 బ్యాలెట్ బాక్స్‌లు ఎత్తుకెళ్లి... రెండింటిని దగ్ధం చేసి నాలుగింటిని చెరువుల్లోనూ... 2 బావిలో పడేసిన విషయం విదితమే.
ఈ సంఘటనకు పాల్పడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి... పలువురిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ప్రస్తుతం వారిని రిమాండ్ నిమిత్తం రాజాం తరలించారు. ఎన్నికల ముందు గ్రామాల్లో పోలీసుల అవగాహన కల్పించినప్పటికీ... ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని డీఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడకుండా... పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ... ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీ... వివాదాస్పద వ్యాఖ్యలు!