ETV Bharat / state

ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ

తనకు అన్యాయం జరుగుతోందనీ.. న్యాయం చేయాలని.. ఆ దళిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు బాధ వినకుండానే.. సీఐ బూటు కాలితో తన్నాడు.. అక్కడ నుంచి వెళ్లి పోవాలంటూ కసిరాడు.. సీఐ నుంచి తన కుమారుడిని రక్షించుకోవటానికి బాధితుడి తల్లి ప్రయత్నించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో విశాఖ రేంజ్​ డీఐజీ స్పందించారు.

author img

By

Published : Aug 5, 2020, 10:24 AM IST

Updated : Aug 5, 2020, 3:51 PM IST

ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ
ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ

రాష్ట్రంలో మరో ఎస్సీ వ్యక్తిపై దాడి జరిగింది. బాధ్యాతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ.. బూటు కాలితో ఎస్సీ వ్యక్తిని తన్నాడు.. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్​ ఆవరణలోనే జరిగింది. చుట్టూ పెద్ద మనుషులు ఉన్నా ఒక్కరూ పట్టించుకోలేదు.

పలాస మండలం టెక్కలిపట్నంకు చెందిన ఎస్సీ వ్యక్తి ఇంటి స్థలం కోసం గత 5 రోజులుగా వివాదం జరుగుతోంది. తనకు న్యాయం చేయాలని కాశీబుగ్గు పోలీస్ స్టేషన్​కు వచ్చి.. సీఐకు పరిస్థితిని వివరిస్తుండగా.. సీఐ వేణుగోపాల్ ఆ వ్యక్తిపై తన ప్రతాపం చూపాడు. బూటు కాలితో తన్ని.. దాడికి దిగాడు. పక్కనే ఉన్న బాధితుడి తల్లి... సీఐ నుంచి తన కుమారుడుని కాపాడుకునేందుకు ప్రయత్నించింది. చుట్టూ పెద్ద మనుషులు ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకో లేదు. బాధితుడు పెద్ద పెట్టున ఏడుస్తున్న.. సీఐ కనికరం చూపలేదు.

  • సీఐ వేణుగోపాల్​పై సస్పెండ్ వేటు

ఎస్సీ వ్యక్తిపై సీఐ వేణుగోపాల్ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘటనపై స్పందించిన విశాఖ రేంజ్ డీఐజీ.. కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్​ను సస్పెండ్ చేశారు. సివిల్ వివాదంలో ఫిర్యాదుదారుడిపై అనుచితంగా ప్రవర్తించినందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: అధికారులు, గ్రామస్థుల మానవత్వం.. అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు

Last Updated : Aug 5, 2020, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.