ఇదీ చదవండి:
పులివెందుల రాజకీయాలను విశాఖ తీసుకొస్తున్నారు: కళా - cm jagan latest news
విశాఖపై సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. గతంలో విజయమ్మను ఎంపీగా ఓడించారనే జగన్‌కు కక్ష అని విమర్శించారు. చంద్రబాబు పర్యటనకు అనుమతులిచ్చి పోలీసులే అడ్డుకోవడమేంటని కళా ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో అలజడి రేపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందుల రాజకీయాలను విశాఖలోకి తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కళా వెంకట్రావు హితవు పలికారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు
ఇదీ చదవండి: