కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లేఖ రాశారు. కేంద్రం ప్యాకేజీ ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు నిత్యావసరాలు ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం బాగుందన్న కళా... ఏపీలో పరిస్థితులు మాత్రం మీ నిర్ణయానికి భిన్నంగా ఉన్నాయని వివరించారు. కేంద్రం ప్రకటించిన సరకులను ఏపీలో ఒక్కరికీ ఇవ్వడం లేదని లేఖలో ఆరోపించారు.
లాక్‌డౌన్‌తో కార్మికులు, కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కళా వెంకట్రావు పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. మధ్యాహ్న భోజనంపై ఆధారపడిన విద్యార్థుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... దీపాలు వెలిగించి సమైక్యతను చాటాలి: సీఎం జగన్