ETV Bharat / state

'విశాఖ రాజధానిపై కాకుండా.. మంత్రి స్థానిక సమస్యలపై పోరాడాలి'

Janasena Leader Nadendla Manohar: జగన్ పాదయాత్రలో ప్రతి పీహెచ్​సీకి డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానన్నారు.. ఇప్పడు వారి సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు. మత్స్యకారులను జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం మత్స్యకార గ్రామాల్లో ఆయన పర్యటించారు.

Nadendla Manohar
నాదెండ్ల మనోహర్
author img

By

Published : Jan 9, 2023, 10:55 PM IST

Nadendla Manohar visited Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంత్రి అప్పలరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలోని రాజధాని సమస్యపై కాకుండా.. మంత్రి అప్పలరాజు మెుదట తన జిల్లాలోని ప్రజల సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు... ప్రతీ పీహెచ్​సీలోనూ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్న జగన్​, ఎం అయ్యాక ఆ హామీని ఎందుకు మర్చిపోయారని నాదెండ్ల మనోహర్ ఆక్షేపించారు. మంత్రి అప్పలరాజు విశాఖ రాజధాని కోసం కాకుండా.. తన నియోజకవర్గ ప్రజల సమస్యలను తీర్చేందుకు పోరాడాలని ఎద్దేవా చేశారు. పలాస మండలం గొల్ల మాకన్నపల్లిలో కిడ్నీ రోగులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.

'కిడ్నీ రోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. మందులు ధరలు పెరుగుతున్నాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామి చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలు మరిచిపోయారు. స్థానిక నేత, ఇక్కడి మంత్రి రాజధాని కావాలి, అమరావతి మారాలి అంటూ, సభలు పెట్టడం కన్నా ఈ ప్రాంత ప్రజల సమస్యలపై స్పందిస్తే మంచిది. గతంలో ఇక్కడి ప్రజల సమస్యలు ప్రపంచానికి తెలపాలని పవన్‌కల్యాణ్‌ ఈ ప్రాంతంలో పర్యటించి వారి సమస్యలను అందరికి తెలిసేలా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను.'- నాదెండ్ల మనోహర్, జనసేన నేత

నాదెండ్ల మనోహర్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్

మత్స్యకారులతో సమావేశం: అనంతరం వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో మత్స్యకారులతో సమావేశమై, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి అనే మహిళ తన వేదనను మనోహర్ ముందు వినిపించారు. తన భర్త ఆరు నెలల క్రితం చెన్నై ప్రాంతానికి వలసపోయి సముద్రంలో వేటకు వెళ్లారని, ఆయన ఆచూకీ గల్లంతు అయిందని తెలిపారు. అక్కడి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రకరకాలుగా అర్జీలు పెట్టామని, నెలలు దాటినా ప్రభుత్వాల నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం గల్లంతయిన భర్త మృతదేహాన్ని కడసారి చూసే భాగ్యం దక్కలేదని రోదించారు. ఇన్ని నెలలైనా కనీసం తన భర్త మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వలేదని, మరణ ధ్రువీకరణ పత్రం లేకపోతే పింఛను ఇవ్వడం లేదని వాపోయింది. ధనలక్ష్మి వేదన విన్న మనోహర్ పార్టీ నుంచి ఆమెకు ఆర్ధిక సహాయం అందించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.