ETV Bharat / state

కన్నవారి కళ్లముందే కాలిపోయిన కుమార్తె - inter student suicide attempt news in srikakulam

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మంటల్లో కాలిపోతుంటే ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవటంతో విలవిల్లాడిపోయారు. కుమార్తెపై పెంచుకున్న ఆశలు ఆవిరి అవుతుంటే గుండెకోతకు గురయ్యారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా బందపల్లిలో జరిగింది.

కన్నవారి కళ్లముందే కాలిపోయిన కూతురు
కన్నవారి కళ్లముందే కాలిపోయిన కూతురు
author img

By

Published : Jun 13, 2020, 12:01 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని బందపల్లిలో విషాదం జరిగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె తల్లిదండ్రుల మందే మంటల్లో కాలిపోయింది. గ్రామానికి చెందిన పాపయ్య, జానకమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. చిన్నకుమార్తె హేమలత(20) ఇంటర్‌ పూర్తిచేసింది.

శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో హేమలత ఒంటిపై డీజిల్‌ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. అప్పుడే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు మంటల్లో కాలిపోతున్న కుమార్తెను చూశారు. నీళ్లు పోసి రక్షించుకునేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు ఎగిసి హేమలత పూర్తిగా కాలిపోయింది.

సమాచారం అందుకున్న మెళియాపుట్టి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: కరోనా కోరల నుంచి బయటపడిన 4నెలల పసికందు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.