శ్రీకాకుళం జిల్లా రాజాంలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా వినూత్న రీతిలో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. మహమ్మారి విజృంభణతో రోజురోజుకూ కేసులు పెరిగిపోవడంపై... భారత్ స్కౌడ్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు.. అధికారులతో కలిసి విచిత్ర వేషధారణలతో కళాకారులు ప్రదర్శనలు చేశారు.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించి స్వీయ నియంత్రణలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శివపార్వతులు, గణపతి, డాక్టర్ వేషధారణలతో రాజాంలోని అంబేడ్కర్ కూడలి వద్ద చేసిన ఈ ప్రదర్శన.. ఆలోచింపజేసింది. అనంతరం.. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేేశారు. సీఐ పప్పల శ్రీనివాసరావు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: