శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ఆమదాలవలసలో వీధి కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
పాలకొండ మండలం తంపటపల్లి గ్రామ పంచాయతీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పది మంది పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం అందించారు.
సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాస కళావతి జెండా ఎగురవేసి.. జాతీయ నాయకులకు నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షులు క్రాంత్ నగర పంచాయతీ కార్యాలయంలో జెండాను ఎగరవేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఇవీ చదవండి: