శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీఆర్ఆర్ ఇటుకల బట్టి లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇచ్ఛాపురం నుంచి కవిటి మండలంకి ఇటుకల లోడుతో వెళ్లిన లారీ ఆన్లోడ్ చేసి.. తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో లారీలో తొమ్మిది మంది కూలీలు ఉన్నారు. అందులో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. మిగిలిన క్షతగాత్రులను 108 వాహనంలో ఇచ్చాపురం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయాన్ని అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు.
ఇవీ చదవండి