వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలోని వ్యవసాయ కనెక్షన్లకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఫిబ్రవరి నెలకు 6 కోట్ల 40 లక్షల రూపాయల నగదు బదిలీ మొత్తాన్ని వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని ఏపీ ఈపీడీసీఎల్ పేరిట చెల్లింపులు చేసేందుకుగానూ ఇంధన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో బిగించిన వ్యవసాయ విద్యుత్ మీటర్లకు ప్రభుత్వమే బిల్లులు చెల్లించేలా కసరత్తు చేశారు. ఈ నగదు బదిలీ మొత్తాన్ని రైతుల ఖాతాల నుంచి ఈపీడీసీఎల్‌కు జమ చేయనున్నారు. 2021 జనవరి నెలలో 8 కోట్ల 16 లక్షల రూపాయల్ని ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంలో నగదు బదిలీ కింద విడుదల చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి:
ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం.. కీలక ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా ఏపీ ఇన్‌క్యాప్