ETV Bharat / state

భారీగా పట్టుబడిన మద్యం.. మొత్తం ఎన్ని సీసాలంటే? - Illegal liquor seized in srikakulam

Illegal liquor seized: అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన ప్రభుత్వం, అలా చేయకుండా భారీగా రేట్లు పెంచింది. ఈ చర్యలతో అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి వచ్చి చేరుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన వాహనాల తనిఖీలో పోలీసులు పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Illegal liquor
అక్రమ మద్యం
author img

By

Published : Dec 3, 2022, 7:13 PM IST

Illegal liquor seized: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దన్నానపేట వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సమయంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ లేబుల్​తో ఒడిస్సా నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. దీని విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని చెప్పారు. మొత్తం 64 బాక్సులల్లో ఉన్న 3072 మద్యం సీసాలను జె.ఆర్.పురం పోలీసులు సీజ్​ చేశారు. ఒడిస్సా నుంచి విజయనగరానికి టాటా మ్యాజిక్ వాహనంలో మధ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.