శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని డీఎస్పీ శివరాం రెడ్డి పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు చేపట్టిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 23 వార్డులుండగా..12 టేబుల్స్ 81 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి: రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకు ?: కూన రవి కుమార్