శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలి వెంకటరావు మెుదటి భార్య ఏడాది కిందట మృతి చెందింది. దీనితో విజయనగరం జిల్లాకు చెందిన అక్కమ్మను ఈ ఏడాది జులై 12న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే తల్లి ఇంటి నుంచి భర్త వద్దకు వచ్చింది అక్కమ్మ. అయితే భార్యాభర్తల మధ్య గొడవ జరగడం వల్ల అక్కమ్మ తలపై గడ్డపారతో కొట్టి చంపాడు వెంకటరావు. అదే ఆవేశంలో బైక్పై పైడి బీమవరం జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ వైపు దూసుకెళ్లాడు. లారీని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనాతో మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు కన్నుమూత