శ్రీకాకుళం జిల్లాలో జాతీయరహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నరసన్నపేట మండలం కోమర్తి కూడలి వద్ద విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గృహనిర్మాణ శాఖ అనుమతితో మంజూరైన ఇళ్లను తొలగింపులో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్వాసితులకు వేరేచోట ఇళ్లను నిర్మించే క్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ ఎంవీ రమణ ఆధ్వర్యంలో మంగళవారం రెవెన్యూ సిబ్బంది..ఇళ్ల యజమానులతో చర్చించారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు.
ఇవీ చదవండి...అక్కడ భూగర్భ డ్రైనేజీ అనివార్యం